Home Page SliderInternational

అమెరికాలో రికార్డు సృష్టించిన మోదీ మెగా ఈవెంట్

అమెరికాలో సెప్టెంబర్ 22న జరగబోయే మెగా ఈవెంట్‌కు రికార్డు స్థాయిలో పేర్లు నమోదయ్యాయి. మోదీ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ అనే కార్యక్రమానికి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దీనికి నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదికగా ఉంటుంది. ఈ వేదిక సామర్థ్యం 15 వేలు కాగా, ఇప్పటికే 24వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుండి భారతీయ అమెరికన్లు హాజరవుతున్నారు. మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఈ ఘటనతో మరోసారి రుజువయ్యింది. ఈ ఈవెంట్‌కు సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ అనంతరం సెప్టెంబర్ 26న ఇక్కడ జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.