Home Page SliderInternational

రిషి సునాక్ ఓటమిపై మోదీ కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ కీలక పోస్టు పెట్టారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ పార్టీ ఓటమిపై స్పందించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీని ఓడించి లేబర్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. రెండేళ్లుగా దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్‌ను మోదీ ప్రశంసించారు. ఆయన యూకేను పాలించడంలో అద్భుతమైన పనితీరును ప్రదర్శించారని, ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో భారత్, యూకేల మధ్య బంధం బలపడిందని పేర్కొన్నారు. రిషి భవిష్యత్తు ప్రయాణం బాగుండాలంటూ ఆయన కుటుంబానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

కొత్తగా విజయం సాధించిన లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తూ, అన్ని రంగాలలో భారత్-బ్రిటన్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సహకారం అందిస్తున్నారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్లు మాత్రమే సాధించింది. లేబర్ పార్టీ 400 పైగా సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకుంది.