ఉపాధ్యక్షుడికి మోదీ శుభాకాంక్షలు..
భారత ప్రధాని నరేంద్రమోదీ ఏఐ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సమావేశాలకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సంభాషించారు. అమెరికా ఎన్నికలలో రిపబ్లికన్లు ఘన విజయం సాధించినందుకు ఆయనను అభినందించారు. ఈ భేటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ కూడా పాల్గొన్నారు.

