విశాఖకు రెండో వందే భారత్ రైలు ప్రారంభించిన మోదీ
తెలంగాణలో మరో వందే భారత్ రైలు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. భారతీయ రైల్వేలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. రైల్వే వేగాన్ని పెంచాలని ఉద్దేశంతో
డబుల్ లైన్స్ ను త్రిబుల్ లైన్స్‌గా మార్చడం జరుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రైల్వే స్టెషన్స్‌ను కూడా పునర్మించే కార్యక్రమం కూడా చేపట్టామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వందేభారత్, అమృత్ భారత్‌తో నూతన రైళ్లను దేశీయ టెక్నాలజీతో ప్రారంభించడం జరిగిందన్నారు. వందే భారత్ రైలు ప్రారంభం సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతి శక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారంట్లను
కూడా ప్రారంభించడం జరుగిందన్నారు. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దిస్తున్నామన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ రూ.500 అభివృద్ది చేస్తున్నామన్న మోదీ… కొమరెళ్ళి రైల్వే స్టెషన్ కూడా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. నూతన MMTS ప్రారంభించుకోవడంతోపాటుగా, త్వరలో చర్లపల్లి టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించగా… వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు.


