తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన మోదీ
‘భారత్ మాతాకీ జై ‘ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. గవర్నర్‌కు,కేంద్రమంత్రులకు, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. అనంతరం ప్రజలనుద్దేశించి, ‘ప్రియమైన సోదర సోదరీమణులారా’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణా రాష్ట్రం కూడా ఏర్పడిందని, తెలంగాణా ప్రజలకు ఎల్లప్పుడూ కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. తెలంగాణా భూమి చాలా పుణ్యభూమి అని, ఇక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రానికి వందేభారత్ రైలును ప్రారంభించడం గొప్ప పరిణామం అన్నారు. తెలంగాణా నిర్మాణంలో కేంద్రప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణా ఏర్పాటుకు త్యాగశీలురెందరో బలిదానం చేశారన్నారు. ఆయన ప్రసంగంలో భాగ్యలక్ష్మీ ఆలయాన్ని కూడా ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. మరో13 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ రోజు ప్రారంభించారు. అనేక ఆధునిక అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ రైళ్లవల్ల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.