Home Page SliderInternational

 “అపురూప కానుకల”తో బైడెన్ దంపతులను ముంచెత్తిన మోదీ

అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు బైడన్ దంపతులు. వారికి మోదీ ప్రత్యేక కానుకలందించారు. ఈ కానుకలలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించింది. బైడన్‌కు ప్రత్యేకంగా గంధపు చెక్కతో చేసిన ప్రత్యేక బాక్సును అందించారు. దీనిలో ప్రాచీన భారతీయ గ్రంథమైన కృష్ణయజుర్వేదంలోని దృష్ట సహస్రచంద్రో అనే పత్రాన్ని దానిలో ఉంచారు. అంటే వెయ్యి పున్నమిలు దర్శించిన వ్యక్తి అని అర్థం. అంటే పూర్ణాయుష్కుడని అర్థం. నెలకు ఒక పౌర్ణమి వస్తుంది. అంటే వెయ్యి పౌర్ణములు దర్శించాలంటే 80 సంవత్సరాల 8 నెలల కాలం పడుతుంది. అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ ఈ వయస్సుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈ బహుమతి అందించారు. ఈ సహస్ర పూర్ణ చంద్రోదయం చూసిన వ్యక్తికి దశదానాలను చేయడం ఆనవాయితీ. ఈ పెట్టెలో గణేష్ ప్రతిమ, దీపం, బెల్లం, ధాన్యాలు, వస్త్రం, వెన్న వంటి వస్తువులతో పాటు   “The ten principles of Upanishads “ అనే పుస్తకాన్ని కూడా అందించారు. దీనితో బైడెన్ ఎంతో సంతోషించారు.

అమెరికా ప్రథమ పౌరురాలు జిల్‌కు ప్రత్యేకమైన గ్రీన్ డైమండ్‌ను బహుమతిగా ఇచ్చారు మోదీ. ఇది 7.5 క్యారెట్లతో జెమోలాజికల్ ల్యాబ్ ధ్రువీకరించిన వజ్రం. దీని తయారీలో సౌర, పవన శక్తిని ఉపయోగించారు. దీనిని కశ్మీరీ కళాకారులు రూపొందించిన డిజైన్లతో గల పేపర్ గుజ్జుతో తయారుచేసిన పెట్టెలో పెట్టి అందించారు. ఈ అపురూప బహుమతులందుకున్న వారు సంతోషంతో ఉప్పొంగిపోయారు.