మూడోసారి అధికారంలోకి వచ్చేదెవరో ప్రజలు ఎప్పుడో డిసైడయ్యారన్న మోదీ
అధికారం కోసం ఓట్లు మోదీ అడగబోరన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ప్రజల కోసం అభివృద్ధి కోసమే ఓట్లు అడుగుతున్నామన్నారు. మూడోసారి వచ్చేది మోదీ సర్కారేనని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు. దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, తెలంగాణలోనూ అలాగే కన్పిస్తోందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. ప్రజలు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించారన్నారు మోదీ. ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు రాబోతున్నాయన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

మల్కాజ్‌గిరిలో రోడ్ షో అద్భుతంగా జరిగిందన్నారు మోదీ. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన చూశానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు మోదీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. తెలంగాణాను గేట్ వే ఆఫ్ సౌత్ అంటారన్నారు. మోదీ కుటుంబం 140 కోట్ల మంది భారతీయులని చెప్పారు. మోదీ గ్యారెంటీ అంటే పూర్తిగా అమలయ్యే గ్యారెంటీ అని చెప్పారు. మోదీ గ్యారెంటీ పేరుతో ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించామన్నారు.