Home Page SliderTelangana

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని పంచ్‌లు

రాష్ట్రప్రభుత్వం ఎంతమాత్రం కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించడం లేదన్నారు మోదీ. కుటుంబవాదంతో, స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కన్నా వారికి వారి కుటుంబ అభివృద్ధే ముఖ్యమన్నారు. ఇలాంటి వారితో రాష్ట్రప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవినీతిపై తాము పోరాడుతున్నామని, ఈ పోరాటంలో ప్రజలు సహకరించాలన్నారు. అవినీతి పరులపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకోవాల్సిందేన్నారు. తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమై వస్తున్నారని, కోర్టుకు వెళ్లినా వారికి అక్కడ కూడా షాక్ తగిలిందని కీలకవ్యాఖ్యలు చేశారు మోదీ. తమ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చామన్నారు. వారసత్వ రాజకీయాలతో ప్రజలకు తెలంగాణా ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. నిజాయితీగా పనిచేసేవారు ఈ ప్రభుత్వానికి నచ్చటం లేదని, తమ కుటుంబం బాగుపడితే చాలనుకుంటారని మండిపడ్డారు మోదీ. ఈరోజు పెరేడ్‌గ్రౌండ్స్‌లో జరుగుతున్న మోదీ సభకు కేసీఆర్ గైర్హాజరైన విషయం మనకు తెలిసిందే.