Home Page SliderNationalNewsSportsviral

ఈ టీనేజ్ క్రికెటర్‌కు మోదీ ప్రశంస..

ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన యువ కెరటం టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని సాక్షాత్తూ ప్రధాని మోదీ ప్రశంసించారు. బిహార్‌లోని ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ బిహార్ బిడ్డ వైభవ్ అద్భుత ప్రదర్శన చూశానని, 14 ఏళ్ల వైభవ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. క్రీడాకారులు ఎంత ఎక్కువ ఆడితే అంత బాగా మెరుగవుతారని ప్రధాని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్  వైభవ్ గురించి మాట్లాడుతూ అతనని బాగా చూసుకోవాలని, జాగ్రత్తగా కాపాడాలని, మరో సచిన్ టెండూల్కర్‌లా తయారు చేయాలని సూచించారు. అతనని వినోద్ కాంబ్లి, పృథ్వీషా మాదిరి కానీయొద్దని సలహా ఇచ్చారు. అతి ప్రచారం, మార్కెటింగ్ చేయకుండా బీసీసీఐ కాపాడుకోవాలన్నారు.