Home Page SliderNational

పులి, సింహం కూనలతో మోదీ ఆటలు

రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్ లో నిర్వహిస్తున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ‘వాంతారా’ను ప్రధాని మోదీ సందర్శించారు. వైల్డ్ లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ విభాగాలకు వెళ్లి వైద్య సదుపాయాలను పరిశీలించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో కలిసి కొంత సమయం గడిపారు. పులి, సింహం కూనలకు ప్రధాని స్వయంగా పాలు పట్టించారు. జిరాఫీలకు ఆహారం అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.