Home Page SliderInternationalNational

మోదీ వరల్డ్ లీడర్… ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జేజేలు!

ప్రధాని మోదీ “ఐకానిక్, వరల్డ్ లీడర్” అంటూ ఆకాశానికెత్తారు మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. దేశంలో జంతు సంరక్షణ కోసం చేసిన కృషికి ప్రధాని మోదీని “ఐకానిక్”, “ప్రపంచ నాయకుడు” అంటూ ఆయన కితాబిచ్చారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక పర్యటనపై ఇంగ్లండ్ మాజీ క్రికెట్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలుజల్లు కురిపించాడు. దేశంలో జంతు సంరక్షణ కోసం చేసిన కృషికి ప్రధాని మోదీకి ఎవరూ సరిరారన్నాడు. వన్యప్రాణులను ఆరాధించే ప్రపంచ నాయకుడు, వాటి సహజ ఆవాసాలలో వాటితో గడిపేటప్పుడు చాలా ఉత్సాహంగా కన్పించారని కొనియాడాడు.

గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా… భారతదేశంలోని అడవిలోకి చిరుతలను విడిచిపెట్టాడు. హీరో, @narendramodi,” అంటూ పీటర్సన్ ట్వీట్టర్లో రాసుకొచ్చాడు. “ప్రాజెక్ట్ టైగర్” 50 సంవత్సరాలను పురస్కరించుకుని కార్యక్రమాలలో భాగంగా 20 కిలోమీటర్ల సఫారీ కోసం ప్రధాని మోదీ ఆదివారం కర్నాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీపై తనకు ఉన్న అభిమానాన్ని కేవీ చాటుకున్నాడు. వదిలివేయబడిన, గాయపడిన ఖడ్గమృగాలను రక్షించడానికి, పునరావాసం కల్పించడానికి ఆఫ్రికా, భారతదేశంలోని ఖడ్గమృగాలను రక్షించండనే స్వచ్ఛంద సంస్థ (సేవ్ అవర్ రైనోస్ ఇన్ ఆఫ్రికా అండ్ ఇండియా) జంతు సంరక్షకుడుగా, పీటర్సన్, మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలిశారు.

“మీ పుట్టినరోజున చిరుతలను విడుదల చేయడం గురించి చాలా ఉద్వేగంగా, ఆప్యాయంగా మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. మీతో సరదా నవ్వి, దృఢంగా కరచాలనం చేసినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని మళ్లీ చూడాలని నేను నిజంగా ఎదురుచూస్తున్నాను సార్!,” అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. దక్షిణాఫ్రికాకు చెందిన 12 చిరుతలను గత నెలలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మోదీ వదిలిపెట్టారు. వాటి పునరావాసం తరువాత, జాతీయ ఉద్యానవనంలో మొత్తం పెద్ద పిల్లుల సంఖ్య 20కి పెరిగింది.

2022లో భారతదేశంలో పులుల జనాభా 3,167గా ఉందని కేంద్ర ప్రభుత్వం తాజా పులుల గణన గణాంకాలను వెల్లడించింది. డేటా ప్రకారం ఇండియాలో పులుల జనాభా 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167గా ఉంది.