Home Page SliderNational

సౌరాష్ట్ర, తమిళ్ సంగమానికి మోదీ హర్షం

రక్షణమంత్రి రాజనాథ్‌సింగ్‌చే సోమనాథ్‌లో ఈరోజు ఆవిష్కరింపబడుతున్న సౌరాష్ట్ర, తమిళ సంగమానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంగమంలో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ఉద్దేశ్యం నెరవేరుతుందని, సౌరాష్ట్ర -తమిళ సంస్కృతుల సమ్మేళనం జరుగుతుందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. 10 రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తమిళ, సౌరాష్ట్ర సంస్కృతుల సమ్మేళనంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి.

ఈరోజు సోమనాథ్ ఆలయం వద్ద గల మైదానంలో సముద్ర దర్శన్ పథ్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు రాజనాథ్ సింగ్. దీనికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్. రవి, తెలంగాణా గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, రిషికేశ్ పటేల్ హాజరుకానున్నారు. ఈ రోజు 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంబం అవుతుంది. తమిళనాడు నుండి వచ్చేవారి కోసం ప్రత్యేక ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవి నేరుగా సోమ్‌నాథ్‌కే చేరుకుంటున్నాయి.

వీటిలో ఆర్ట్స్, కల్చర్, పెయింటింగ్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ మీట్స్, హస్తకళలు, షాపింగ్ ఫెస్టివల్స్, సాండ్‌ఆర్ట్, జానపద కళలు వంటి అనేక అంశాలు ప్రదర్శించబడతాయి. ఈ కార్యక్రమం ఏక్ భారత్- శ్రేష్ట్ భారత్ నినాదంతో నిర్వహించబడుతుంది. భారతీయ రాష్ట్రాలు, వాటి సంస్కృతులను వేరువేరు రాష్ట్రాలకు పరిచయం చేయడం, వాటిని మిళితం చేయడం దీని ముఖ్యఉద్దేశ్యం. ఈ 10 రోజుల కార్యక్రమంలో ప్రధాని మోదీ చివరి రోజు హాజరు కానున్నారు.