అభివృద్ధి చేసిన ఘనత మోడీదే..
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ రైల్వే కనెక్టివిటీని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం జరిగింది. ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రూ.3,900 కోట్ల చేసిన పనులను ప్రారంభించు కోవడం సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.