NationalNews

దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని ప్రారంభించిన మోదీ

మన దేశంలో ఆరోగ్య సంరక్షణకు ఆధ్యాత్మికత దోహదపడుతోంది. ఈ మేరకు 130 ఎకరాల విస్తీర్ణంలో..రూ.6000 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో కూడిన 2,600 పడకల చక్కటి హాస్పటల్ నిర్మాణం జరిగింది. అదే ఆధ్యాత్మిక గురువు అమృతానందమయి ఫరిదాబాద్‌లో నిర్మించిన అమృత హాస్పిటల్. ఈ విధంగా రూపుదిద్దుకున్న అమృత హాస్పటల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ ప్రసంగిస్తూ..భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ,ఆధ్యాత్మికత ముడిపడి ఉంటాయన్నారు.

దేశంలో  కొవిడ్-19 వ్యాక్సినేషన్ వంటి భారీ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్‌జీవన్ మిషన్‌తో నీటి కారణంగా వచ్చే వ్యాధుల్లో తగ్గుదల నమోదైనట్లు ఇటీవలే నివేదిక అందిందన్నారు. మాతా అమృతానందమయి మఠం ఆధ్యర్యంలో ఈ ఆసుపత్రిని నిర్మాణం జరగడం చాలా సంతోషమని మోదీ పెర్కొన్నారు. అనంతరం వేదికపై ఆశీనులైన మఠం వ్యవస్థాపకులు మాతా అమృతానందమయి ఆశీస్సులు తీసుకున్నారు. మోదీ ఆమెను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పాల్గొన్నారు.