‘ఢిల్లీ హృదయంలో మోదీ’..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ ప్రజల హృదయంలో ప్రధాని మోదీ ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువయ్యిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయంపై అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో ఇలా ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారని, అబద్దపు ప్రచారాలు, ప్రామిస్‌లు చేసేవారిని తిప్పి కొట్టారని వ్యాఖ్యానించారు. దశాబ్దకాలంగా ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నారని, పొంగి పారుతున్న మురుగు కాల్వలు, కలుషిత నీరు, కలుషిత యమునా నది, ఏమాత్రం నాణ్యత లేని మౌలిక సదుపాయాలతో ప్రజలు విసిగి పోయారని పేర్కొన్నారు.