Andhra PradeshHome Page SliderNational

కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్, టైమ్స్ నౌ, నవభారత్ సర్వే అంచనా

దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీ, మిత్రులకు 292-338 స్థానాలొస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 106-144 సీట్లొస్తాయని, ఇక తృణముల్ కాంగ్రెస్ పార్టీకి 20-22 స్థానాలు, వైసీపీకి 24-25 ఎంపీ స్థానాలొస్తాయని సర్వే అభిప్రాయపడింది. ఇక బీజేడీ 11-13 స్థానాల్లో గెలుస్తోందని, ఇతరులు 50-80 స్థానాల్లో గెలవొచ్చని సర్వే అంచనా వేసింది.

రాహుల్ గాంధీ పార్లమెంట్ అనర్హత ద్వారా లబ్ధి పొందుతారా అన్న ప్రశ్నకు 23% మంది అవునని సమాధానం చెప్పగా, అది అసలు విషయమే కాదని 11 శాతం మంది, చెప్పలేమని 27 శాతం మంది బదులిచ్చారు. ఇది న్యాయపరమైనదని 39 శాతం మంది సమాధానం చెప్పారు. 2024లో ప్రధానిగా 64 శాతం మంది మోదీకి ఓటేస్తే, రాహుల్ గాంధీకి 13 శాతం, నితీష్ కుమార్‌కు 6 శాతం, కేసీఆర్ కు 5 శాతం, కేజ్రీవాల్ కు 12 మంది మద్దతు పలికారు.

2024లో విపక్షాల తరపున బలమైన అభ్యర్థి ఎవరన్నదానికి 29 శాతం రాహుల్ అని, 13 శాతం మమత బెనర్జీ అని, 19 శాతం కేజ్రీవాల్ అని, 7 శాతం కేసీఆర్ అని, 8 శాతం నితీష్ కుమార్ అని 24 శాతం మంది మాత్రం ఒకరొస్తారంటూ బదులిచ్చారు. 2024లో ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు అడ్డుకోగలవా అంటూ వేసిన ప్రశ్నకు 49 శాతం మంది కాదని, కొంత వరకు అవకాశం ఉందని 19 శాతం మంది, మందు విపక్షాలు ఐక్యంగా ఉండాలని 15 శాతం మంది, విపక్షాలు మోదీకి చెక్ పెడతాయని 17 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇక 2024 నాటికి విపక్షాలన్నీ ఏకమవుతాయా అన్న ప్రశ్నకు 31 శాతం మంది అవునని, 26 శాతం కాదని, ఎన్నికలయ్యాక అవగాహన కుదురుతుందని 26 శాతం మంది చెప్పగా, 17 శాతం మంది మాత్రం చెప్పలేమన్నారు.