కేంద్ర ఉద్యోగుల డీఏ పెంచిన మోదీ సర్కారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా గిఫ్ట్ ప్రకటించింది. ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను 34 శాతం నుంచి 38 శాతానికి (4 శాతం పెంపు) పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ డీఏ పెంపుదల ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు నెల వరకు చెల్లుబాటు అవుతుంది. సెప్టెంబరు నెల జీతంలో రెండు నెలల డీఏ బకాయిలు కూడా అందుతాయి. కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏ పెంచే అవకాశం ఉంది. ఫ్రీ రేషన్ పథకం కాలపరిమితిని కూడా మోదీ మంత్రివర్గం పెంచింది.