బ్రిటన్ కొత్త ప్రధానికి ఫోన్ చేసిన మోదీ
బ్రిటన్ ప్రధానిగా కైర్ స్టార్మర్ ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత్‌లో పర్యటించాలని బ్రిటన్ ప్రధానిని మోదీ ఆహ్వానించారు. అయితే కొన్ని నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడుకున్న వీరిద్దరు ఇరుదేశాల మధ్య సంబంధాలు,సహకారంపై చర్చించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మసూద్ పెజెష్కియాన్‌కు కూడా మోదీ ఫోన్ చేసి విషెస్ తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నట్లు మసూద్ పెజెష్కియన్‌కి తెలిపినట్లు ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.