Home Page SliderTelangana

ఈడీ కస్టడికి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజూ కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రతి రోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుచాలని ఈడీని ఆదేశించింది.