Home Page SliderTelangana

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగర మోగింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలోని రెండు గ్రాడ్యుయేట్లు, ఒక టీచర్ స్థానానికి, తెలంగాణలోని రెండు టీచర్ స్థానాలు, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఏపీలోని ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం విజయనగరం విశాఖ పట్నం టీచర్ స్థానాలు.. తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ పట్టభద్రుల స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 27 పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ రిలీజ్: ఫిబ్రవరి 3, నామినేషన్ల చివరి తేది: ఫిబ్రవరి 10, నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 11, నామినేషన్ల విత్ డ్రా లాస్ట్ డేట్: ఫిబ్రవరి 13, పోలింగ్ తేది: ఫిబ్రవరి 27, పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు ఓట్ల లెక్కింపు తేది: మార్చి 3