ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా న్యుమోనియా (కాలేయ సంబంధిత ఇబ్బందులు)తో బాధపడుతున్న ఆయనను ఈ నెల 25వ తేదీన నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. భగీరథ రెడ్డి తండ్రి కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 1, 2021న మృతి చెందారు. ఆయన స్థానంలో భగీరథ రెడ్డి మే నెలలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్లలోనే తండ్రీకొడుకు చనిపోవడంతో భగీరథ రెడ్డి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గురువారం అవుకులో జరిగే అంత్యక్రియల్లో ఏసీ సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడే భగీరథ రెడ్డి.