Andhra PradeshHome Page Slider

రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాగా ఈ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే వీరిలో ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు,సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో.. మాజీ సీఎం జగన్ సాధారణ ఎమ్మెల్యేలతోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా రేపటి నుంచి రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలపై కూడా చర్చలు జరగబోవు. ఈ రెండు రోజులు కేవలం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక,సీఎం,డిప్యూటీ సీఎం,మంత్రులతోపాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు మాత్రమే జరగనున్నాయని అధికారులు తెలిపారు.