ఎమ్మెల్యేకి నిరసన సెగ.. కోడి గుడ్లతో దాడి ..
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తాకింది. ఇటీవల మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేయడం వెనక దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే హస్తముందని ఆరోపిస్తూ ప్రభాకర్ రెడ్డి పర్యటనను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్ పై కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో దుబ్బాక పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు.