Home Page SliderPoliticsTelangana

మంత్రిపై ఎమ్మెల్యేల గూడుపుఠాణీ

తెలంగాణలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఒక మంత్రిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, తమ పనులు కావడం లేదని వాపోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని ఒక ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో వీరు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్లు సమాచారం. ప్రధానంగా టాప్-5 పొజిషన్‌లో ఒక మంత్రిపై వీరు ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో గాంధీ భవన్‌లో ఈ పుకార్లు వినిపిస్తున్నాయి.