Andhra PradeshHome Page Slider

ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో హోరాహోరీ జరుగుతోంది. వైసీపీ-టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను కొట్టారని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పోడియం వద్ద పడిపోయారు. మరో ఎమ్మెల్యే గోరంట్ల వద్ద ఉన్న ప్లకార్డును లాక్కొని చించేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బైఠాయించి నిరసన తెలిపారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ హోరాహోరీతో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకొంది.