గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే..స్పీకర్ ఆగ్రహం
అసెంబ్లీలో గుట్కా తిని, అక్కడ ప్రవేశ ద్వారం వద్ద ఉమ్మేసిన ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ సతీశ్ మహానా దీనిని గుర్తించారు. దీనితో అసెంబ్లీని అవమానించారని మండిపడ్డారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అలా ఎవరు చేశారో తెలుసుకోవాలని భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. ఒక ఎమ్మెల్యే ఇలా చేసినట్లు గుర్తించి, ఇలాంటి సంఘటనలు సహించబోమని హెచ్చరించారు.