Home Page SliderTelangana

బాధితురాలిని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణలో రోజురోజుకు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాచార ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితురాలిని యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. అత్యాచార ఘటన ప్రతిఘటించి బాధితురాలు రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడిందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆమెకు సరైన వైద్యం అందలేదన్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి వెంటనే ఘటన వివరాలు తెలుసుకొని కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తో మాట్లాడి బాధితురాలికి ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారన్నారు. బాధితురాలకు న్యాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. నిందితుడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్. ఆయన వెంట ఎమ్మెల్యే హరీష్ బాబు, రామారావు పటేల్ కూడా ఉన్నారు.