Home Page SliderTelangana

సన్న బియ్యం అన్నం తిన్న ఎమ్మెల్యే

రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో లక్ష్మమ్మ అనే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే వేముల వీరేశం సన్న బియ్యం అన్నం తిన్నారు. భోజనంలో గోంగూర పచ్చడి, పప్పు, పచ్చిపులుసు, మజ్జిగ ఏర్పాటు చేశారు. గోంగూర పచ్చడి అడిగి మరి వేయించుకుని ఎమ్మెల్యే తిన్నారు. నకిరేకల్ లో మొట్టమొదటి ఇల్లు లక్ష్మమ్మ కుటుంబానికి ఇస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.