‘దొంగఓట్లతోనే గెలిచా’ ఒప్పుకున్న ఎమ్మెల్ల్యే రాపాక
ఆత్మీయసమ్మేళనంలో మనసులోని మాట బయటపెట్టేశారు ఎమ్మెల్ల్యే రాపాక. తన అనుచరులే ఒక్కొక్కరు పదేసి దొంగఓట్లు వేసేవారని అందుకే దాదాపు 800 ఓట్ల మెజారిటీతో గెలిచానని నవ్వుతూ చేప్పేశారు రాజోలు ఎమ్మెల్ల్యే రాపాక వరప్రసాదరావు. 2019లో జనసేన నుండి గెలిచిన ఆయన గెలిచాక, వైసీపీ తీర్థం తీసుకుని, పార్టీ మారిపోయారు.

తన సొంతఊరు చింతలమోరులో కాపుల ఓట్లు లేవని, ఎస్సీల ఓట్లు తెలియదని సరదాగా చెప్పేశారు. అక్కడున్నవాళ్లు అందరూ కూడా నవ్వుకున్నారు. అక్కడ ఎవరు ఎటు నుండి వచ్చినా ఎవరికీ తెలియదన్నారు. తన గెలుపుకు ఎప్పటినుండో ఈ దొంగఓట్లే కారణం సిగ్గులేకుండా నవ్వుతూ చెపుతున్నారు రాపాక.

కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే పార్టీ మారిపోవడమే కాకుండా, దొంగఓట్లే కారణమని చెప్పడంతో జనసైనికులు మండిపడుతున్నారు. ఈ ఎమ్మెల్యేకి, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తిట్టుకుంటున్నారు. దీనికి మరి ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెపుతారో చూడాలి. ఇలాంటి నాయకులతో ప్రజాస్వామ్యం ఎంతటి అవహేళనకు గురవుతోందో, ఇక ఓటుకు విలువేముందో ప్రజలు ఆలోచించాలి.

