అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
పొలిటికల్ రేసుగుర్రాల్లో ఒకరైన ఏపి సీనియర్ నేత, వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. పిఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయడానికి ఆయన ఇలా హాజరయ్యారు.వాస్తవానికి పిఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటి) పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే 10 శాతం సీట్లున్నప్పుడే ఇది సాథ్యమౌతుంది.కానీ వైసీపికి గత ఎన్నికల్లో 10శాతం సీట్లు రాకపోవడంతో ఈ పదవి అయినా ప్రతిపక్షానికి ఇస్తారా లేదా అధికార కూటమి పార్టీయే తీసుకుంటుందా అన్న చర్చ మొదలైంది.

