యూసుఫ్‌గూడలో హల్చల్ సృష్టించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి – కేసు నమోదు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. నిన్న జరిగిన ఎన్నికల సందర్భంగా యూసుఫ్‌గూడలో కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి హల్చల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఆపినా వినకుండా ఆయన బృందంతో కలిసి మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లోకి బలవంతంగా ప్రవేశించి, అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

