రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తా-ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి: నియోజకవర్గంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి మండలంలోని కమలాపూర్, రాంపూర్, నందిగామ, ఆజంనగర్, దూదేకులపల్లి, రాంపూర్, ఆముదాలపల్లి, పంబాపూర్, నాగారం తదితర అటవీ గ్రామాల్లో మంగళవారం ఆయన కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, ప్రజలు జీఎస్సార్‌ను శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి, ప్రతి బుధవారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.