అనుమానాస్పద స్థితిలో ఎమ్మెల్యే మృతి
ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అనుమనాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. తన ఇంట్లో గన్ షాట్‌కు గురైన ఆయనను కుటుంబీకులు.. అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అయితే ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది సందేహాస్పదంగా మారింది.కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.