ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి..
బీజేపీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని దుండగులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్నం ఆర్ఆర్ నగర పరిధిలోని లక్ష్మిదేవి నగర్ వార్డు బీజేపీ కార్యాల యంలో వాజ్ పేయి జయంతిలో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంగా గుర్తు తెలియని దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే మునిరత్నం మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, అతడి తమ్ముడు తనని చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ దాడి చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ కార్యకర్తలేనని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

