మన దేశంలో మోస్ట్ హ్యాపీయస్ట్ స్టేట్ ఏదో తెలుసా?
భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం ఇప్పటికే దేశంలో 100% అక్ష్యరాస్యత కలిగిన రెండవ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కాగా ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా సర్వేలో మొదటిస్థానం దక్కించుకుంది. గురుగ్రామ్‌లోని మెనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్ట్రాటెజీ ప్రొఫెసర్ రాజేశ్ కె.పిలానియా దీనిపై అధ్యయనం చేశారు. మొత్తం 6 అంశాలు అనగా కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు,వృత్తి,మతం,కొవిడ్-19 ప్రభావం,దాతృత్వం వంటి వాటిని ప్రాతిపదికగా తీసికొని సర్వే నిర్వహించారు. కాగా ఈ 6 అంశాలు స్థానిక ప్రజల శారీరక,మానసిక ఆరోగ్యం,ఆనందంపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో పరిశీలించారు. ఈ పరిశీలనలో మిజోరాంను అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించారు. అంతేకాకుండా మిజోరాం రాష్ట్రం 100% అక్షరాస్యత సాధించడానికి కారణం అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశమవుతారట. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి తల్లిదండ్రులతో కలిసి పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. అంతేకాకుండా మిజోరాంలో కులం రహిత సమాజం ఉండటం కూడా వారి సంతోషానికి ప్రధాన కారణమని చెప్పాలి. అక్కడ లింగ వివక్షత కూడా ఉండకపోవడం గమనార్హం. కాగా మిజోరాంలో ఆడ,మగ తేడా లేకుండా యువత 16,17 ఏళ్ల వయస్సులోనే ఉపాధి పొందుతున్నారు. చిన్న వయస్సులోనే స్వతంత్రగా సంపాదించడాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తుంటారు. అంతకుమించి ఈ రాష్ట్రంలో అమ్మాయిలు,అబ్బాయిలు అనే వివక్ష లేదు. ఫలితంగా మిజోరాంలో ఉద్యోగం చేసే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉంటారని నివేదిక వెల్లడించింది.