చెయ్యేస్తే నరకండి.. బాలికలకు కత్తుల పంపిణీ
ఆడవాళ్ల పై చెయ్యి వేసే దుర్మార్గుల చేతులను నరికివేయాలని బిహార్ లోని బీజేపీ ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ అన్నారు. దసరా సందర్భంగా సీతామఢీ జిల్లా కేంద్రంలో స్కూల్, కాలేజీ బాలిక లకు ఆయన కత్తులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మన అక్కాచెల్లెళ్లను ముట్టుకోవడానికి ఎవడైనా ప్రయత్నిస్తే, వాడి చేతిని ఈ కత్తితో నరికివేయాలి” అని ఎమ్మెల్యే మిథిలేశ్ అన్నారు. “తమపై చెయ్యి వేసే దుర్మార్గుల చేతులను నరకగలిగే విధంగా మన అక్కాచెల్లెళ్లను తయారు చేయాలి. ఆడవాళ్ల విషయంలో దుర్బుద్ధితో ఉన్నోళ్లందరినీ నాశనం చేయాలి” అని చెప్పారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు మండపాల దగ్గర బాలికలకు కత్తులను ఎమ్మెల్యే మిథిలేశ్ పంపిణీ చేశారు.