మా ఎమ్మెల్యే మిస్సింగ్..
తెలంగాణ ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఒక్క ట్వీట్ చేస్తే చాలు నేనున్నానంటూ ముందుకొచ్చి సాయం చేస్తాననే తమ ఎమ్మెల్యే కేటీఆర్ జాడ లేకుండా పోయాడంటూ బీజేపీ నేత కోడె రమేశ్ గంభీరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు సమస్యలతో నిండిపోయాయి. కానీ పట్టించుకునే తీరిక ఆయనకు లేకుండా పోయింది. ప్రచార ఆర్భాటాలు తప్ప పనులు పూర్తి చేయడంలో కేటీఆర్ ఆసక్తి లేదు. తమ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.