Home Page SliderInternational

ఉక్రెయిన్‌లో చిన్నారుల ఆసుపత్రిపై క్షిపణి దాడి

ఉక్రెయిన్ రష్యా యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అతి పెద్ద చిన్నారుల ఆసుపత్రిపై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడి చేసింది రష్యా. అనేక ఇతర ముఖ్య నగరాలపై కూడా దాడికి తెగబడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారని, మరో 50 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ఈ ఆసుపత్రి ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద చిన్నారుల ఆసుపత్రిగా పేర్కొన్నారు. ఓఖ్ మాత్‌డిత్ అనే ఈ ఆసుపత్రితో పాటు సమీపంలోని ఇతర భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా నోరు విప్పాలని ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీ అన్నారు. అమెరికా నాటో దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్న వేళ ఈ దాడులు జరగడం విశేషం. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.