సీఎం కాన్వాయ్‌కి తప్పిన ముప్పు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయికి తృటిలో ముప్పు తప్పింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గం నారం పేటలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ ఆర్చి లాంటి కట్టడం ఏర్పాటు చేశారు. ఈ ఆర్చి ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందుకెళ్లిన నిమిషాలలోనే కూలిపడిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద ఘటనను పర్యవేక్షిస్తున్నారు.