హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్
అందాల భాగ్యనగరంలో ప్రపంచ అందాల పోటీలు జరబోతున్నాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. ఓపెనింగ్, క్లోజింగ్ సెర్మనీ, గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాల యువతులు పాల్గొని తమ తమ సత్తాతో అలరించనున్నారు. ఇందులో పాల్గొనే వారి వయసు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. విజేతకు వజ్రాల కిరీటం అందిస్తారు.