తిరుమలలో అపచారం..
తిరుమలలో హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడంపై మరోసారి అపచారం జరిగిందని వైసీపీ పార్టీ మండిపడింది. శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్ తిరగడం ఆగమశాస్త్ర నియమాలకు విరుద్దం అని, తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అని పేర్కొంది. తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించింది. టీడీపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రవిమానయాన శాఖా మంత్రిగా ఉండి కూడా ఇలా ఎలా జరిగిందని ప్రశ్నించింది.

