Home Page SliderTelangana

తెలంగాణ RTC బస్సుల్లో తప్పనున్న చిల్లర కష్టాలు

హైదరాబాద్: బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ఆర్‌టీసీ కసరత్తు చేస్తోంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపుల ద్వారా టిక్కెట్లు జారీ చేయనున్నారు. అందుకు ప్రత్యేకంగా ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు 13,200 టిక్కెట్ జారీ చేయి యంత్రాలను కొనుగోలు చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు.