నడిరోడ్డుపై మంత్రి దౌర్జన్యం
రుషికేశ్‌లో ఉత్తరాఖండ్ ఆర్థికమంత్రి ప్రేమ్‌చంద్ నడిరోడ్డుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కారుకు అడ్డొచ్చారని ఇద్దరు యువకులను తన గన్మెన్లతో కలిసి చితకబాదారు. ముందుగా చెంపపై కొట్టిన మంత్రి, వారు వాగ్వాదానికి దిగడంతో పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన రుషికేశ్ ప్రధాన రహదారిపైనే జరిగింది. స్థానికులపై ఇలా అఘాయిత్యం చేయడంతో అక్కడి వారు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఓపికగా ఉండాలని, ఇలా ప్రజలపై రెచ్చిపోకూడదని హితవు చెప్తున్నారు. ఈ మంత్రివ్యవహారం చాలా విమర్శలకు దారితీస్తోంది.