Home Page SliderTelangana

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఆకస్మిక పర్యటన

ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కలిసి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెన్ గంగా నది బ్రిడ్జిని సందర్శించారు.. నదిలో వరద ఉధృతిని పరిశీలించారు.. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని జిల్లా అధికార యంత్రాంగం సమీక్షించాలని ఆదేశించారు.. సర్వే చేసి వరదల వల్ల నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించారు.. పంట నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా నిచ్చారు. మంత్రితో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వెంట ఉన్నారు.