పూల వ్యాపారిని చితకబాదిన మంత్రి మేనల్లుడు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బీజేపీకి చెందిన మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు నిఖిల్ తోమర్ ఓవరాక్షన్ చేశాడు. పూల షాపులతో ఇరుకుగా ఉన్న వీధిలో మహీంద్రా స్కార్పియోను డ్రైవ్ చేశాడు నిఖిల్. ఎదురుగా ఆటో రావడంతో వాహనాన్ని నిలిపి దుర్భాషలాడాడు. వాహనం వెళ్లేందుకు దారి లేకపోవడంతో అక్కడున్న ఒక పూల వ్యాపారితో నిఖిల్ వాగ్వాదానికి దిగి చితకబాదాడు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మాటా మాటా పెరగడంతో ఇది ఘర్షణకు దారి తీసింది. తర్వాత నిఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

