పుష్ప సినిమాపై మంత్రి కీలక వ్యాఖ్యలు
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో లు వేసేందుకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు. సిటీ నడిబొడ్డున బెనిఫిట్ షో లు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబంతో సరదాగా మూవీ చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.