పోలవరంపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు
తాజాగా పోలవరంపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిందో ఇంకా నిర్ధారించలేదన్నారు. దానికి ఇంకా కొంత సమయం పడుతుందని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ సంస్థ చెప్పిందన్నారు. అప్పటివరకు పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ బలంగా కోరుకుంటుందన్నారు. అసలు డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం టీడీపీయేనని ఆరోపించారు. పోలవరంలో ముందుగా కాపర్ డాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి గల కారణాలు ఏంటని కేంద్రాన్ని కోరతామన్నారు.