ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ: నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదలపై ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 12 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పారు. అయితే జాబ్ క్యాలెండర్‌పై సమీక్ష చేసిన తర్వాత విడుదల చేయొచ్చని తెలుస్తోంది.