‘ధాన్యం రాశులా.. అందాల రాశులా?’ ప్రశ్నకు మంత్రి కౌంటర్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి రైతుల కష్టాలు పట్టించుకోకుండా ధాన్యం రాశులను విస్మరించి, మిస్ వరల్డ్ పోటీల పేరుతో అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈవిషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధాన్యం లెక్కలు విడుదల చేశారు. ప్రతీ విషయంలోనూ ఆరోపణలు చేయడం మానుకోమన్నారు. నిజం తెలుసుకుని మాట్లాడాలని సెటైర్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ లేని స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లపై కూడా హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోటా ఇస్తామన్నారు.