Andhra PradeshHome Page Slider

మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్రాల పర్యటన

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పథకం అమలుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రాల పర్యటనకు బయలుదేరనున్నది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశం అనంతరం కమిటీ సభ్యులు కర్ణాటక, తెలంగాణల్లో పర్య టనకు వెళ్లనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వీరి పర్యటన సాగనుంది. త్వరగా మంత్రుల కమిటీ నివేదిక అందించేందుకు సిద్ధమైంది. అందులో ఉన్న లాభనష్టాలతో పాటు ఎదురయ్యే ఇబ్బందులను కూడా ఈ నివేదికలో ప్రస్తావించనున్నారు.